Reading Time: < 1 minute
ప్రేమ విషయంలో ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తోపు.. మీ రక్తమే మీరు ఎలాంటివారో చెప్పేస్తుంది..

సాధారణంగా రక్త పరీక్షలు కేవలం అనారోగ్యాలను గుర్తించడానికే అని మనం అనుకుంటాం. కానీ జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, ముఖ పఠనం లాగే, ఒక వ్యక్తి బ్లడ్ గ్రూపప్ ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా B బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు సమాజంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. వారిలోని సానుకూలతలు, లోపాలు, ప్రేమ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రియేటివిటీకి మారుపేరు

B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు సహజంగానే చాలా చురుగ్గా ఉంటారు. వీరిలో నిర్ణయం తీసుకునే శక్తి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. ఇతరుల కోసం ప్రాణాలైనా ఇచ్చేంత దాతృత్వం వీరి సొంతం. ఎవరైనా ఆపదలో ఉంటే ముందుంటారు. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, స్మార్ట్‌గా కనిపిస్తారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే మనస్తత్వం వీరిది. బంధాలకు, అనుబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

ముక్కు మీదే కోపం.. మరికొన్ని లోపాలు

నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే, వీరి స్వభావంలోనూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.

  • వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఒక్కోసారి ఆ కోపంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు.
  • కొన్ని సందర్భాల్లో తమ స్వార్థం కోసం ఆలోచిస్తారనే పేరు ఉంది. వీరు అనుకున్నదే జరగాలని పట్టుబడతారు.
  • ఆర్థిక క్రమశిక్షణ వీరిలో కొంచెం తక్కువగా ఉండవచ్చు. నచ్చిన వస్తువు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు.

ప్రేమ, వివాహ జీవితం

ప్రేమ విషయంలో B గ్రూప్ వ్యక్తులు చాలా నమ్మకస్థులు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని అపురూపంగా చూసుకుంటారు. తమ భాగస్వామికి ఇచ్చే గౌరవం, వారు చూపించే ప్రేమ ఎదుటివారిని మంత్రముగ్ధులను చేస్తుంది. తమ లైఫ్ పార్ట్నర్‌ను ఎప్పుడూ స్పెషల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని పెళ్లి చేసుకునే వారు చాలా అదృష్టవంతులని చెబుతుంటారు.

జపాన్ వంటి దేశాల్లో బ్లడ్ గ్రూప్ ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పద్ధతి చాలా ప్రాచుర్యంలో ఉంది. శాస్త్రీయంగా దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సామాజికంగా చాలా మంది తమ రక్త గ్రూపు లక్షణాలతో ఏకీభవిస్తుంటారు. మీది B గ్రూప్ అయితే ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఒక్కసారి సరిచూసుకోండి.