సన్ స్క్రీన్ చర్మానికి చాలా మంచిది. ఇది ఎండ వేడి, యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఇక వేసవి ప్రారంభం అవ్వడంతో ఇప్పటికే మార్కెట్లోకి అనేక రకాల సన్ స్క్రీన్స్ వచ్చేసాయి. కానీ కెమికల్స్ లేకుండా ఇంటిలోనే కొబ్బరి నూనె, కలబంద, జింక్ ఆక్సైడ్ వంటి సహజమన పదార్థాలతో సన్ స్క్రీన్ తయారు చేసుకొని మీ చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి కాపాడుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు : రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె, వన్ టీ స్పూన్ కోకో బటర్, వన్ టీ స్పూన్ కలబంద జెల్, టీ స్పూన్ జింక్ ఆక్సైడ్ పౌడర్, ఆు చుక్కల టీ ట్రీ ఆయిల్.
తయారు చేసుకునే విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక పాత్ర పెట్టాలి. అందులో కొబ్బరి నూనె కోకో బటర్ వేసి లోప్లేమ్లో మంచిగా కరిగేలా చూసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి.ఇక చల్లారిన మిశ్రమంలో కలబంద జెల్ వేసి, క్రీమీలాంటి ఆకృతి వచ్చేలా బాగా కలపాలి. ఇలా బాగా కలపడం వలన జిగురులాంటిది లేకుండా, అచ్చం క్రీమ్ లా చాలా బాగా ఉంటుంది.
ఇప్పుడు, ఈ మిశ్రమంలో జిక్ ఆక్సైడ్ వేసి, ఉండలు లేకుండా కరగబెట్టాలి. దీని కోసం గ్యాస్ ఆన్ చేసి చాలా తక్కువ మంటపై బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా చాలా నెమ్మదిగా కలపాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఇది గోరు వెచ్చగా ఉన్న సమయంలోనే లావెండర్ వేయాలి. దీని వలన మంచి సువాసన రావడమే కాకుండా ఇది చర్మఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇక ఇది చల్లారిన తర్వాత దీనిని గాలి చొరబడని సీసాలో వేసుకోవాలి. అంతే సన్ స్క్రీన్ రెడీ.




