
మన తెలంగాణ/హైదరాబాద్: ఎండలను దృష్టి లో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో మూ డు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటం తో రేషన్ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఒ క్కరికీ (మూడు నెలలకు సంబంధించి 18 కిలోల బియ్యాన్ని) నెలాఖరు వరకు తీసుకోకపోతే కోటా రద్దు చేస్తామని రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేషన్‌షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీనికి తోడు రేషన్‌షాపుల వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప లు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మూ డు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపి ణీ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది.
రాష్ట్ర వ్యా ప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. సన్న బియ్యం పంపిణీ పథకం కింద ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున మొత్తం మూడు నెలలకు కలిపి 18 కిలోల బియ్యం పంపిణీ జరుగుతుంది. రేషన్ బియ్యం రవాణా నిల్వ పరిమితు ల కారణంగా కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే పంపిణీ చేపట్టింది. రేష న్ బియ్యం పంపిణీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రా ష్ట్రంలోని ప్రధాన గోదాంల నుంచి జిల్లాలోని లబ్ధిదారులకు సరిపడా బియ్యం నిలువలను సివిల్ సప్లయ్ శాఖ సరఫరా చేస్తోంది.
బయోమెట్రిక్‌తో చిక్కులు..
ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ నిబంధనల ప్రకారం మూడు నెలల బియ్యం తీసుకోవాలంటే లబ్ధిదారు లు ఈ-పాస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. ప్రతి నెలకు విడివిడిగా అథెంటికేషన్ చేయాల్సి రావడంతో ఒక్కో కార్డుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ఒకేసారి లక్షలాది మంది బయోమెట్రిక్ వేస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వేలిముద్రలు పడక ప్రజలు గంటల తరబడి క్యూలైన్‌లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండుతుండటంతో వృద్ధులు, మహిళలు షాపుల వద్ద తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రద్దీని తగ్గించేందుకు కొన్ని చోట్ల డీలర్లు టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పటికీ,
అది మరింత గందరగోళానికి దారితీస్తోంది. మరోవైపు, గోదాంల నుంచి వస్తున్న బియ్యం బస్తాల్లో తూకం తక్కువగా ఉందని డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కేజీల బస్తాలో 4 కేజీల వరకు తక్కువగా వస్తోందని, దీంతో తాము నష్టపోతున్నామని డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. అయితే బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ నెల మొత్తం కొనసాగుతోంది. అలాగే, మూడుసార్లు థంబ్ వేసే పద్ధతిని మార్చి, ఒకే వేలిముద్రతో 3 నెలల బియ్యం ఇచ్చేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలని వారు కోరుతున్నారు.