Reading Time: 2 minutes
Tollywood : ఏంటీ.. ఈ అమ్మడు ఆ స్టార్ హీరో మేనకోడలా.. ? డెకాయిట్ చిత్రంలో ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోద్ది..

టాలీవుడ్ విలక్షణ నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎప్పటిలాగే ఈ మూవీతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు అడివి శేష్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన ఓ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారిపోయింది. ఆ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు నెటిజన్స్. డెకాయిట్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన ఆ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో మేనకోడలు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. మనం మాట్లాడుకుంటున్న తార పేరు జైన్ మేరీ ఖాన్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

జైన్ మేరీ ఖాన్.. బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ మేనకోడలు. అలాగే ఇమ్రాన్ ఖాన్, జునైద్ ఖాన్ కజిన్ సిస్టర్. స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఎక్కడా తన కుటుంబసభ్యుల పేరు ఉపయోగించకుండా సాధారణ అమ్మాయిల సినీరంగంలోకి అడుగుపెట్టింది. 1993 మార్చి 20న జన్మించిన జైన్ మేరీ ఖాన్‌ తండ్రి పేరు మన్సూర్ ఖాన్. అతడు హిందీలో పాపులర్ డైరెక్టర్. చిన్నప్పటి నుంచి చెన్నైలో విద్యాబ్యాసం పూర్తి చేయడంతో ఆమె ముంబై ఈవెంట్లలో ఎక్కడా కనిపించలేదు. ‘కపూర్ అండ్ సన్స్’, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసింది. 2020లో ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ సిరీస్ ద్వారా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి నటిగా తెరంగేట్రం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేసిన ఆమె.. ఇప్పుడు డెకాయిట్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.40 కోట్ల వరకు ఉంటుంది. సినిమాల్లోకి రాకముందే ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా సంపాదిస్తుంది 2021లో యాక్టర్ ఆకాష్ మొహిమెన్‌ను ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. అలీబాగ్‌లో జరిగిన ఈ ప్రైవేట్ వెడ్డింగ్‌ను ఆమె కజిన్ ఇమ్రాన్ ఖాన్ దగ్గరుండి జరిపించాడు. ప్రస్తుతం ఆమె తెలుగులో మరింత బిజీ నటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

 

View this post on Instagram

 

A post shared by Zayn Khan (@zaynmarie)

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..