
శనివారం ఐపిఎల్‌లో చెన్నై సూపర్ రకింగ్స్, ఢి్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. దీంతో ఈ సీజన్‌లో చెన్నై తొలి విజయాన్ని నమోదు చేసింది. చెన్నై బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సెంచరీతో విధ్వంసంస సృష్టించగా.. యువ ప్లేయఱ్ ఆయుశ్ మాత్రే కూడా రాణించాడు. ఈ మ్యాచ్‌లో అర్థ శతకం సాధించి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు..
ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదురుకున్న ఆయుశ్ 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 59 పరుగులు చేశాడు. అయితే మంచి ఫామ్‌లో ఉండగా.. అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కి పిలిపించుకున్నారు. అయితే ఆయుశ్ పెవిలియన్ చేరే సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లబించింది. అయితే సాధారణంగా క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ రెండు వేర్వేరు. రిటైర్డ్ హర్ట్ అంటే గాయం కారణంగా మైదానం వీడి వెళ్లిపోవడం. కానీ, రిటైర్డ ఔట్ అంటే జట్టు కోసం మైదానం విడిచి వెళ్లడం. రిటైర్డ్ హర్ట్ అయితే.. మళ్లీ తిరిగి ఆడే అవకాశం ఉంటుంది. కానీ, రిటైర్డ్ ఔట్ అయితే.. మళ్లీ తిరిగి ఆడే అవకాశం ఉండదు. దీంతో ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌లో తొలి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగి రికార్డుల్లోకెక్కాడు.