Reading Time: < 1 minute
ఈసారి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత.. గత ఐదేళ్లలోనే తొలిసారి!

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. ఫస్ట్‌ ఇయర్‌లో 4,89,123, సెకండ్‌ ఇయర్‌లో 3,58,490 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను 2026 ఇక్కడ చెక్‌ చేసుకోండి.

అయితే గత ఐదేళ్లతో పోలిస్తే ఈ సారి ఇంటర్ ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది.

  • 2022 మొదటి సంవత్సరం 64.86 శాతం
  • 2022 రెండో సంవత్సరం 68.68 శాతం
  • 2023 మొదటి సంవత్సరం 62.85 శాతం
  • 2023 రెండో సంవత్సరం 67.27 శాతం
  • 2024 మొదటి సంవత్సరం 61.08 శాతం
  • 2024 రెండో సంవత్సరం 69.49 శాతం
  • 2025 మొదటి సంవత్సరం 66.91 శాతం
  • 2025 రెండో సంవత్సరం 71.43 శాతం
  • 2026 మొదటి సంవత్సరం 66.94 శాతం
  • 2026 రెండో సంవత్సరం 75.61 శాతం

రాష్ట్రాల వారీగా చూస్తే ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో మేడ్చల్‌ 77.31 శాతం మార్కులతో టాప్‌లో నిలిచింది. మహబూబాబాద్‌ జిల్లా 44.91 శాతంలో అత్యల్ప ఉత్తీర్ణత పొందింది. ఇక ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లోనూ మేడ్చల్‌ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా 20 శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో ఉత్తీర్ణత పొందారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.