Reading Time: < 1 minute
Aditya Dhar: ప్రభాస్‌ లెజెండ్‌ అంటూ.. ధురంధర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తోన్న ధురంధర్ ది రివేంజ్ సినిమాను ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ చూశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి అల్లు సినిమాస్ లో ఈ సినిమా క్రేజ్‌ను విట్‌ నెస్ చేశారు. ఈ క్రమంలోనే ధురంధర్ డైరెక్టర్ ఆధిత్య ధర్.. ప్రభాస్ ను లెజెండ్‌ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేయడం ఇప్పుడు నార్త్‌ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ధురంధర్ ది రివేంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రానికి 1680 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమా ప్రాపగండా మూవీ అంటూ బాలీవుడ్ లో కొందరు చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పోస్ట్ చేశారు. అలాంటి ప్రాపగండా మూవీస్ చేసే వాళ్లే నిజాయితీగా నిజాన్ని చెబుతూ రూపొందించే ధురంధర్ ది రివేంజ్ వంటి మూవీస్ పై విష ప్రచారం చేస్తారని సందీప్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కు డైరెక్టర్ ఆదిత్యధర్ థ్యాంక్స్ చెబుతూ తను నమ్మిన కంటెంట్ ను తీసి తన అభిప్రాయాలపై బలంగా నిలబడే సందీప్ వంగా స్ఫూర్తిగా నిలుస్తారంటూ రిప్లై ఇచ్చారు. దర్శకుడు సందీప్ వంగా ధురంధర్ ది రివేంజ్ సినిమాను అప్రిషియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధర్…లెజెండ్ ప్రభాస్ కు తన ప్రేమను తెలియజేయమంటూ తన రిప్లై లో రాసుకొచ్చారు. ప్రభాస్ ను లెజెండ్ అని కోట్ చేస్తూ.. ఆయన స్పిరిట్ సినిమా థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నానంటూ ఆదిత్య ధర్ తన ట్వీట్‌లో రాయడం ఇప్పుడు బీ టౌన్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. దాంతో పాటే ఆదిత్యధర్, ప్రభాస్ కాంబోలో ఓ క్రేజీ మూవీ వస్తే బాక్సాఫీస్ బద్దలవుతుందనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

అటవీ మార్గంలో బస్సు పై దాడి.. ప్రయాణికుల హాహాకారాలు