Reading Time: < 1 minute

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏకనా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. లక్నోని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నోకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. రబాడా బౌలింగ్‌లో వరుసగా సిక్సు, ఫోరు బాదిన మార్ష్(11) ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్(18).. మహ్మద్ సిరాజ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి రాహుత్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే(6 ఓవర్లు) ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజ్‌లో బదోనీ(5), మార్క్‌రమ్(22) ఉన్నారు.