Reading Time: < 1 minute

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓటమిని చవి చూశారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విఫలం కావడంతో ఎంఐ ఓడిపోయింది. ఈ సందర్భంగ ఎంఐ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మీడియాతో మాట్లాడారు. రాబోయే మ్యాచ్‌లో ఎంఐ జట్టులో భారీగా మార్పులు ఉంటాయని తెలియజేశారు. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోవడంతో పాటు బౌలింగ్‌లో భారీగా పరుగులు ఇచ్చామని చెప్పారు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉందని, చాలా విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్‌సిబి జరిగిన మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ పోరాటం జట్టుకు ఎంతో ఉపయోగం పడిందని ప్రశంసించారు. ముంబయి జట్టుకు ఎప్పుడు అతడు అదనపు బలమని కొనియాడారు. చివరలో రూథర్ ఫోర్డ్ 31 బంతుల్లో ఒక ఫోర్ తొమ్మిది సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు.