
పానుగల్,వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పానుగల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
అనంతరం బుసిరెడ్డిపల్లి గ్రామం నుంచి కేతేపల్లి వరకు 2.40 కోట్ల నిధులతో 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు.
గ్రామాల్లో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్,తహసిల్దార్ వెంకటేశ్వర్లు,ఎంపీడీవో గోవిందరావు, మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్,కాంగ్రెస్ నాయకులు రాము యాదవ్,జయరాములు సాగర్,వాల్మీకి, వివిధ గ్రామాల సర్పంచులు,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.