Reading Time: < 1 minute
Telangana Intermediate 1st And 2nd Year Results To Be Released On April 12 2026 At 1100 Am

పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. నేడు ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలను (మార్చి 2026, జనరల్ & వొకేషనల్) ఏప్రిల్ 12, 2026న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్‌ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేస్తారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే, విద్యార్థులకు సులువుగా తమ ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది ఎన్టీవీ తెలుగు వెబ్‌సైట్.. మీరు ఇక్కడ క్లిక్‌ చేసి.. మీ హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా.. క్షణాల్లో మీ ఫలితాలను పొందవచ్చు.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..

ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..