Reading Time: < 1 minute

ముంబయి: ఐపిఎల్ లో భాగంగా ముంబయి ఇండియన్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై 18 పరుగుల తేడాతో ఆర్ సిబి గెలుపొందింది. తొలుత ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబయి బ్యాట్స్ మెన్లు విఫల కావడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. షెర్పన్ రూథర్ పోర్డ్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ముంబయి బ్యాట్స్ మెన్లలో షెర్పన్ రూథర్ పోర్డ్ (71), హార్ధిక్ పాండ్యా(40), రికెల్టన్(37), సూర్యకుమార్ (33) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతో ముంబయి ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మకు దెబ్బతగలడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ముంబయి బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా, సలమ్ ధర్, జాకోడ్ డఫీ తలో ఒక వికెట్ తీశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.