
శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘చింతామణి సొంతకథ’. ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ అద్దంకి దయాకర్ క్లాప్ కొట్టగా, జీహెచ్ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ వందనకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
సోషల్ యాక్టివిస్ట్ డా.శ్రీనివాస్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా రూపొందిస్తున్నామని దర్శకుడు ప్రేమ్ రాజ్ అన్నాడు.