Reading Time: < 1 minute

విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

Caption of Image.
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, అన్-మ్యాన్డ్ వర్కర్లు, ఔట్‌‌సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగారని తక్షణమే వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. 

©️ VIL Media Pvt Ltd.