
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచులో సంజు శాంసన్ అద్భుతమైన సెంచరీ చేయగా, మరో యంగ్ ప్లేయర్ ఆయూష్ మాత్రే సైతం క్లాసీ హాఫ్ సెంచరీ చేయడంతో భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన చెన్నై టీమ్ కి మంచి ఆరంభం లభించింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్– సంజు శాంసన్ మధ్య నెలకొన్న 62 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ (6.2)లో గైక్వాడ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పాథుమ్ నిస్సంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకుని మరోసారి చెన్నై అభిమానులని మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఆయూష్ మాత్రే– సంజు శాంసన్ తో జత కలవడంతో.. వీరిద్దరి మధ్య 113 పరుగుల పార్ట్నర్ షిప్ తర్వాత మాత్రమే రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు.
ఇక సంజు శాంసన్ మాత్రం క్లాసీ బ్యాటింగ్ తో సూపర్బ్ సెంచరీ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. అయితే చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన శివమ్ దూబే మెరుపు బ్యాటింగ్ తో కేవలం 10 బంతుల్లోనే 20 పరుగులు కొట్టాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే వికెట్ తీసుకోగా.. మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన చెన్నై 212 రన్స్ చేయగా.. ఢిల్లీ ముందు 213 పరుగుల టార్గెట్ పెట్టారు.
𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝘃𝗲. 𝗣𝗼𝘄𝗲𝗿𝗳𝘂𝗹. 𝗛𝗶𝗴𝗵𝗹𝘆 𝗜𝗺𝗽𝗮𝗰𝘁𝗳𝘂𝗹. 🔥
Drop an emoji for Sanju Samson’s performance tonight? 👇
Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson pic.twitter.com/gI918IKo2i
— IndianPremierLeague (@IPL) April 11, 2026