Reading Time: < 1 minute

మంచిర్యాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ‘దాచుకో.. దోచుకో’ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అదే పని మీద ఉన్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో కెటిఆర్ పర్యటించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన క్యాతనపల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ.. బిఆర్ఎస్-సిపిఐ కూటమి తరఫున గెలిచి కౌన్సిలర్లు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అటకెక్కించిందని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట.. సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కెటిఆర్ ఆరోపించారు.