Reading Time: < 1 minute

ఇస్లామాబాద్: ఇరాన్ తో ఒప్పందానికి రాలేకపోవడం దుర్వార్త అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ తెలిపారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్ కే పెద్ద నష్టం అని అన్నారు. ఇరాన్ తో చర్చల తర్వాత జేడీవాన్స్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ప్రతి నిధులతో 21 గంటలపాటు కీలక చర్చలు జరిపామని, అమెరికా, ఇరాన్ కు మధ్య అంతరం తగ్గించేందుకుపాకిస్థాన్ కృషి చేసిందని తెలియజేశారు. ఇరుదేశాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ సహాయపడిందని, ఇరాన్ కు ఇదే చివరి, ఉత్తమమైన ప్రతిపాదన అని హెచ్చరించారు. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కావాలని, ఇరాన్ అణ్వాయుధాలు, పరికరాలు సమకూర్చుకోదనే హామీ అవసరమని జేడీవాన్స్ పేర్కొన్నారు. అమెరికా చాలా సరళమైన ప్రతిపాదన, అవగాహన పద్ధతిలో వెళ్తోందని, ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనక్కి వెళ్తున్నామని అన్నారు.  ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించలేదని, అమెరికా షరతులు అంగీకరించకూడదని ఇరాన్ నిర్ణయించుకుందని తెలిపారు. అమెరికా ప్రతిపాదనను ఇరాన్ అంగీకరిస్తుందో లేదో చూద్దాం జేడీవాన్స్ అన్నారు.