Reading Time: < 1 minute
Priyanka Arun Mohan Interview Og Movie Made In Korea Ott Success

తెలుగు తెరపై ‘గ్యాంగ్‌లీడర్‌’గా ఎంట్రీ ఇచ్చి, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌. నాని సరసన పరిమితమైన హావభావాలతో మెప్పించిన ఈ భామ, ఆ తర్వాత ‘శ్రీకారం’లో బబ్లీ గాళ్‌గా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ (OG)తో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. తాజాగా ఆమె నటించిన ‘మేడ్‌ ఇన్‌ కొరియా’ చిత్రం థియేటర్ల వద్ద యావరేజ్ అనిపించుకున్నా, ఓటీటీలో మాత్రం రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక తన సినీ ప్రయాణం వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

ప్రియాంక మాట్లాడుతూ..‘చిన్నప్పటి నుంచి నాకు నటనంటే ప్రాణం. సినిమాలు చూస్తున్నప్పుడు నన్ను నేను తెరపై చూసుకోవాలని కలలు కనేదాన్ని. బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ, నా ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే ఉండేవి. అందుకే చదువు పూర్తవ్వగానే వెండితెరకు పరిచయమయ్యాను’ అని తెలిపింది. 2019లో కన్నడ సినిమా ‘ఒంధ్‌ కథే హెళ్లా’తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, నాని, శర్వానంద్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇక పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’లో నటించడం తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పే ప్రియాంక, సవాలు విసిరే రోల్స్ అంటేనే తనకు ఇష్టమని అంటోంది.. ‘వైవిధ్యభరితమైన పాత్రలు చేసినప్పుడే నటిగా గుర్తింపు వస్తుంది. ‘మేడ్ ఇన్ కొరియా’ సినిమాలో అలాంటి పాత్రే చేశాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో నటిగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్నాను’ అని ఆమె పేర్కొంది.