Reading Time: 2 minutes

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ వేదికగా అమెరికా , ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాల మధ్య ముఖాముఖి అధికారిక చర్చలు శనివారం రాత్రి జరిగాయి. ముందుగా వేర్వేరుగా తరువాత నేరుగా జరిగిన చర్చలు ముగిశాయి. తరువాత అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాలు పరస్పరం మధ్యమధ్యలో మూడు పక్షాల మధ్య త్రైపాక్షిక చర్చలు కూడా జరిగాయి.రెండో దఫా చర్చలు శనివారం అర్థరాత్రి తరువాత కానీ ఆదివారం కానీ జరుగుతాయని ఇరాన్ టీవీ తెలిపింది. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికార వర్గాలు నిర్థారించలేదు. 1979 నాటి ఇస్లామిక్ రెవెల్యూషన్ తరువాత ఇరాన్ అమెరికా మధ్య జరిగిన ముఖాముఖీ చర్చలు ఇవే. ఇప్పుడు కుదిరిన అంగీకారానికి క ట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. లిఖితపూర్వక పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. సర్దుబాట్లకు సమ్మతిస్తున్నామని ఇందులో తెలియచేసుకున్నట్లు వెల్లడైంది. పశ్చిమాసియా పోరుకు శాశ్వ త శాంతి పరిష్కారం దిశలో ఇస్లామాబాద్‌లో సా గుతోన్న సంప్రదింపులపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠత నెలకొంది.

ఇరాన్ డిమాండ్లలో అత్యంత కీలకమైన మూడు నాలుగింటిపై అమెరికా నుంచి సానుకూ ల స్పందన వెలువడిందని స్పష్టం అయింది. ఖతా ర్ ఇతర దేశాల్లోని ఇరాన్ బ్యాంకు ఖాతాల స్తంభ న ఎత్తివేత, ఆస్తుల విడుదల, ఇరాన్ సొంతం చేసేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడైంది. లె బనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అమెరికా హామీ ఇచ్చింది. దీని తరువాతనే ఇరాన్ బృందం నేరుగా అమెరికా బృందంతో చర్చలకు సిద్ధపడింద ని అధికార వర్గాలు అంతర్గతంగా తెలిపాయి. అమెరికా ఉన్నత స్థాయి బృందంలో దేశ ఉపాధ్యక్షులు జెడి వాన్స్, ట్రంప్ అల్లుడు, జెర్‌డ్ కుశ్నేర్, మిడిలిస్టు దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అరాగ్చి, స్పీకర్ ఘాలీబాఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు దేశాల ప్రతినిధి బృందాలతో వేర్వేరుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ దశలో అత్యంత కీలకమైన క్లిష్ట అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తమ షరతులు నెగ్గితేనే నేరుగా పరస్పర చర్చలు ఉంటాయని షరీఫ్‌కు ముందుగా ఇరుదేశాల ప్రతినిదులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే వారికి నచ్చచెప్పి, పరోక్ష చర్చలతో లాభం లేదని, నేరుగా మాట్లాడుకుంటేనే ఫలితం ఉంటుందని పాక్ ప్రధాని వారికి నచ్చచెప్పినట్లు , తరువా త ముఖాముఖీ చర్చలు జరిగినట్లు స్పష్టం అయిం ది.

చర్చలు పురోగతిలో ఉన్నాయనే ఆశిస్తున్నట్లు పాక్ అధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. తీవ్రస్థాయి ఉద్రిక్తతల తరువాత ఇరుదేశాల ప్రతినిధి బృందాలు నేరుగా మాట్లాడుకోవడం ఇదే తొ లిసారి అని ఈ చర్చలపై పాకిస్థాన్ టీవీ వార్తా కథనాలు వెలువరించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ సమర్థవంత దౌత్యనీతిని చాటేందుకు విశేషాలను జోడించారు. ఈ చర్చలతో ఇరుపక్షాల మధ్య శాం తికి వీలేర్పడుతుందని ప్రపంచ నేతలు సహేతుక ప్రకటనలు వెలువరించారని, పాక్ దౌత్యనీతి విజ యం దిశలో సాగుతోందని తెలిపారు. తొలి దఫా చర్చల తరువాత పాకిస్థాన్ విదేశాంగ కార్యాల యం నుంచి సంబంధిత విషయాలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఓ అధికారి నిర్థారించా రు. ఈ చర్చలతో సుస్థిర శాంతి స్థాపనకు మార్గం ఏర్పడుతుందని తాము ఆశిస్తున్నట్లు ప్రధాని షరీఫ్ తెలిపారు. చర్చలలో ఇరాన్ వైఖరి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమెరికా , ఇరాన్ ప్రతినిధి బృందాలతో చర్చలలో పాకిస్థాన్ తరఫున ప్రదాని షరీఫ్‌తో పాటు దేశ విదేశాంగ మంత్రి, ఉప ప్రధా ని ఇషాఖ్ డార్, సైనిక దళాల ప్రధానాధికారి మా ర్షల్ అసిం మునీర్, అంతర్గత వ్యవహారాల మం త్రి మెహిసన్ రజానక్వీ ఇతరులు పాల్గొన్నారు. ఇ స్లామాబాద్‌లో చర్చలు ఐదు గంటలు ఆలస్యం గా మొదలయ్యాయని తెలిసిందని అంతకు ముందు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ షరతుల తో ఈ పరిస్థితి ఏర్పడిందని, తాము అన్ని గమని స్తూ ఉన్నామని, చర్చల పట్ల ఇరాన్ వైఖరి, చిత్తశు ద్ధి ఏమిటనేది తెలుస్తూనే ఉందన్నారు.

చర్చలు విఫలమైతే భారీ మూల్యం : ట్రంప్

ఇస్లామాబాద్ చర్చలు ఎలా జరగుతున్నాయో తన కు అవగాహన కానీ, సమాచారం కానీ లేదని అ మెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని చర్చల విషయంలో అంచనా వేయగలమని అన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడులు భీకరంగా ఉంటాయని, అత్యంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శక్తివంతమైన ఆ యుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్‌తో చ ర్చ లు ఆలస్యం కావడంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధి వీలైంనత త్వరగా తెరుచుకోబోతోందని, ప్రత్యామ్నాయ రవాణా మా ర్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు ట్రంప్ వివరించారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా పేర్కొన్నారు.