Reading Time: < 1 minute

తిరుమలలో లగేజీ కౌంటర్ లో ఉద్యోగి చేతివాటం… విధుల నుండి తొలగించిన టీటీడీ

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీవారి దర్శనానికి వచ్చే అశేష భక్త జనం కోసం ఉచిత లగేజీ డిపాజిట్ సౌకర్యం అందిస్తోంది టీటీడీ. అయితే, తిరుమలలో లగేజీ కౌంటర్ లో పని చేసే ఓ ఉద్యోగి చేతివాటం చూపించాడు. లగేజీ కౌంటర్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసే నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుండి డబ్బులు వసూలు చేశాడు.

నరసింహారెడ్డి నిర్వాకంపై టీటీడీకి ఫిర్యాదు చేశారు కొంతమంది భక్తులు. భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టీటీడీ నరసింహారెడ్డిని విధుల నుంచి తొలగించింది. 

►ALSO READ | అమెరికాలో విజయనగరం టెకీ మృతి.. మూడు నెలల క్రితమే జాబ్ వచ్చింది.. పాపం పుట్టిన రోజే..

లగేజీ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని… భక్తులెవ్వరూ తమ లగేజీ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది టీటీడీ..నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే.. విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ : 9866898630 కు ఫిర్యాదు చేయాలని సూచించింది టీటీడీ.
 

©️ VIL Media Pvt Ltd.