Reading Time: < 1 minute
Pradeep Ranganathan Lik Movie Failure Analysis Vignesh Shivan Nayanthara

‘కోమలి’తో దర్శకుడిగా, ‘లవ్ టుడే’తో హీరోగా మారి వంద కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మొదటిసారి పరాజయం పలకరించింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోకి, తాజాగా విడుదలైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఊహించని షాక్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. కారణం కథలో కొత్తదనం లేకపోవడం, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, నెమ్మదిగా సాగే కథనం, పాత చింతకాయ పచ్చడి లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ అంటూ ప్రచారం చేసినప్పటికీ, థియేటర్లో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను తిరస్కరించారు.

Also Read : Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

ప్రచారంలో సరైన బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించిన నయనతారకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారిందని సమాచారం. దీంతో వరుస విజయాలతో టాప్ లీగ్‌లో ఉన్న ప్రదీప్ రంగనాథన్‌కు ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి. కేవలం క్రేజ్ ఉంటే సరిపోదు, బలమైన కథాబలం ఉండాలని ‘LIK’ రిజల్ట్ మరోసారి నిరూపించింది. అయితే ప్రదీప్ లాంటి టాలెంటెడ్ నటుడు కేవలం ఒక ఫ్లాప్‌తో వెనకడుగు వేయడు. తన తదుపరి సినిమాలతో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో తన సత్తా చాటిన ప్రదీప్, ఈ అనుభవంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంది.