Reading Time: < 1 minute
Telangana Intermediate Results Released 70 58 Pass Percentage General And Vocational Combined

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్ ను ప్రభుత్వ సలహా దారు కెకె, ఇంటర్ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఫస్టియర్ మొత్తం విద్యార్థులు 4,89,123 మంది.. పాసైన విద్యార్థులు 3,23,807 మంది.. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 66.02.. బాలికల ఉత్తీర్ణత 74.4 శాతం.. బాలుర ఉత్తీర్ణత 57.69 శాతం నమోదైనట్లు తెలిపారు.

సెకండియర్ మొత్తం విద్యార్థులు 5,07,948.. సెకండియర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 3,58,490 మంది.. సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం 70.58.. బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం.. బాలుర ఉత్తీర్ణత 62.5 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ.. ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభంకానున్నట్లు తెలిపారు. దివ్యంగా విద్యార్థులకు స్కూటర్ లు అందజేయనున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 9 లక్షల 97 వేల 75 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది ద్వితీయ సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. మొత్తం 1495 పరీక్ష కేంద్రాలలో ఈ ఎగ్జామ్స్ జరిగాయి.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..

ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..