Reading Time: 2 minutes

అక్షయ తృతీయకు ముందే దిగొస్తున్న బంగారం, వెండి.. లక్షన్నరకే తులం ధర…

Caption of Image.

ఈ వారం చివర్లో అక్షయ తృతీయ వంటి పండుగలు ఉన్న కూడా… ఈ రోజు (ఏప్రిల్ 13, సోమవారం) బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం పెరిగిన రేట్లు ఈ వారం మొదట్లోనే మళ్ళీ కిందకు దిగివచ్చాయి.

ప్రస్తుతం బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు రూ. 38 తగ్గి, ఇప్పుడు రూ. 15,246 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 35 తగ్గి, రూ. 13,975కు చేరుకుంది.  18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 290 తగ్గి రూ.11,434కి  పపొయింది. 

వెండి ధరలు చూస్తే 1గ్రాము వెండి రూ. 5 తగ్గి రూ. 255కు పడిపోయింది. దింతో కిలో వెండి ఏకంగా రూ. 5,000 తగ్గి రూ. 2,55,000 వద్ద చేరింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈరోజు  బంగారం, వెండి ధరల్లో  మార్పులు వచ్చాయి.  ఇరాన్-అమెరికా గొడవలపై  ఇరాన్‌తో చర్చలు ఫలించకపోవడంతో, హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల కొరత ఏర్పడుతుందనే భయం పెరిగింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

10  గ్రాముల   24 క్యారెట్ల బంగారం ధర  రూ.380 తగ్గి రూ.1,52,460కి చేరింది. 

10  గ్రాముల   22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.1,39,750కి  చేరింద

10  గ్రాముల   18 క్యారెట్ల బంగారం ధర   రూ.290 తగ్గి రూ.1,14,340కి’  చేరింద

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్,  కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460, 22 క్యారెట్ల ధర రూ.1,39, 750, 18 క్యారెట్ల ధర రూ.1,14, 340. 

ఇక వెండి 1 గ్రాము ధర రూ.5 తగ్గి రూ.255కి చేరగా… కిలో ధర  రూ. 5,000 తగ్గి  రూ.2,55,000గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వెండి ధర కేజీకి రూ.2,60,000గా ఉంది. 

ప్రపంచ మార్కెట్లలో, డాలర్ బలపడటంతో బంగారం ధర దాదాపు వారం రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవ్వడంతో చమురు ధరలు భారీగా పెరగడం ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు తగ్గాయి.  ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్,  ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుండి చూస్తే, బంగారం ధర ఇప్పటివరకు 11% కంటే ఎక్కువ పడిపోయింది.

 

©️ VIL Media Pvt Ltd.