Reading Time: < 1 minute

ఖమ్మం జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ప్రారంభం

Caption of Image.

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా సైన్స్ మ్యూజియం, సైన్స్ సెంటర్‌‌‌‌ను శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాల బాలికలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇలాంటి సైన్స్ మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం డీఈవో చైతన్య జైని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కమిషనర్ ఆఫ్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, మేయర్ శ్రీమతి నీరజ, డిప్యూటీ మేయర్ శ్రీమతి ఫాతిమా జోహార, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు  తదితరులు పాల్గొని ప్రసంగించారు.  

©️ VIL Media Pvt Ltd.