
ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని బౌండరీలు దాటిస్తున్నాడు. అయితే వైభవ్ ఓ విషయంలో చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. అతడి టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌పై బిసిసిఐ ఫోకస్ పెట్టింది. డగౌట్‌లో ఫోన్ వాడుతూ కనిపించడంతో బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాంచైజీ ప్లేయర్లు, సిబ్బంది డ్రెస్సింగ్ రూంలో ఫోన్లు వినియోగించవచ్చు. కానీ, డగౌట్‌లో మాత్రం అందుకు అనుమతి లేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సమయంలో రోమీ ఫోన్‌తో ఉన్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఓ ఇన్‌ఫ్లూయన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై బిసిసిఐ స్పందించింది.
‘‘అవును ఆటగాళ్లు మ్యాచ్ అధికారుల ప్రదేశం (పిఎంఒఎ) వద్ద ఎవరూ సెల్ ఫోన్లు వాడకూడదు. కానీ, భిందర్ మాత్రం నిబంధనను ఉల్లంఘించారు. టీమ్ మేనేజర్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ఫోన్‌ను వినియోగించే అవకాశం ఉంది. కానీ, డగౌట్‌లో వాడకూడదు. అయితే, భిందర్ విషయంలో అనుకోకుండా ఇలా జరిగిన ఉండొచ్చు. నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. కాబట్టి, చర్య తీసుకోవాలి. హెచ్చరిక ఇస్తారా.? లేదా ఏదైనా చర్య తీసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్ రిఫరీతో పాటు అవినీతి నిరోధక యూనిట్ నివేదిక ప్రకారమే ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని బిసిసిఐ పేర్కొంది.