
మద్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతానికి చెందిన దేవకృష్ణ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఏప్రిల్ 7న తన నివాసంలోనే పదునైన ఆయుధంతో దాడికి గురై మరణించాడు. అయితే అతని భార్య ప్రియాంక మాత్రం ఇదంతా దొంగల పనిగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రూ. 3.5 లక్షల క్యాష్‌తో పాటు నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కూడా తాళ్లతో కట్టేశారని చెబుతూ బాధితురాలిగా నటించింది. ప్రియాంక పోలీసుల ఎదుట పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఆ వీడియో తెగ వైరల్ కూడా అయింది. దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పిన నగలు ఇంట్లోనే దొరకడంతో పోలీసుల అనుమానం బలపడింది. దీనికి తోడు దేవకృష్ణ సోదరి ఇచ్చిన వాంగ్మూలం కేసును మలుపు తిప్పింది. “నువ్వు నల్లగా ఉన్నావు, నీకంటే అందగాడు నాకు దక్కాలి” అంటూ ప్రియాంక తరచూ తన భర్తను అవమానించేదని ఆమె తెలిపింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంకకు కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్తను అడ్డు తొలగించుకోవడానికి కమలేష్ స్నేహితుడైన సురేంద్ర భట్‌కు లక్ష రూపాయల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా రూ. 50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించింది. హత్యలా కాకుండా దోపిడీలా కనిపించేలా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన సురేంద్ర, నిద్రిస్తున్న దేవకృష్ణపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. ప్రస్తుతం పోలీసులు ప్రియాంకను, ఆమె ప్రియుడు కమలేష్‌ను అరెస్ట్ చేయగా, సుపారీ తీసుకున్న సురేంద్ర పరారీలో ఉన్నాడు. వైరల్ వీడియోపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aditya Dhar: ప్రభాస్ లెజెండ్ అంటూ.. ధురంధర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్