
హైదరాబాద్: గనుల రంగంలో ఆత్మనిర్భరత దిశగా ముందుకెళ్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వేలంలో గనులశాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు. హెచ్ఐసిసిలో బొగ్గు గనుల వేలం రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ఏడాదిలో 225 మైనింగ్ బ్లాక్ ల వేలం జరిగిందని, ఏడో విడతలో 19 గనుల వేలం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వేలంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో పాలుపంచుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం 46 గనుల వేలం నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్ అందిస్తున్నామని, పర్యావరణహితంగా సరైన విధానాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. పరిశ్రమలు కూడా దేశ హితం, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని గనులశాఖ అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు.