
బాహుబలి 2తో డార్లింగ్ క్రియేట్ చేసిన రికార్డుల్ని జబర్దస్త్ గా దాటేశారు పుష్పరాజ్. ఇప్పుడు పుష్పరాజ్ రికార్డుల్ని క్రాస్ చేసే పనిలో ఉన్నారు ధురంధర్. రిలీజ్ టైమ్‌తో పోలిస్తే ఇప్పుడు ధురంధర్ స్పీడు కాస్త తగ్గిందందనే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరి రెండు వేల కోట్ల టార్గెట్‌ని రీచ్ అయ్యేదెప్పుడు? తగ్గేదేలే అనే మేనరిజాన్ని సుకుమార్ ఏ క్షణాన క్రియేట్ చేశారోగానీ అల్లు అర్జున్‌కి పర్ఫెక్ట్ గా సూట్ అయిందని చెప్పుకున్నారంతా. దానికి తగ్గట్టే బాహుబలి రికార్డులను దాటేసినప్పుడు ఆ మేనరిజానికి న్యాయం జరిగిందని మురిసిపోయారు ఫ్యాన్స్. మరి ఇప్పుడు పుష్పరాజ్ అడ్డాలో ధురంధర్ దాడికి పాల్పడుతాడా? అనే ఇంట్రస్టింగ్ చర్చ షురూ అయింది. నిజానికి ధురంధర్-2 సినిమా అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో 1000 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసిన మొదటి హిందీ సినిమాగా నిలిచింది. ఒక సినిమాకు సంబంధించిన రెండు భాగాలు 1000 కోట్లు అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 1680 కోట్లు వసూలు చేసింది ఆదిత్యధర్ ధురంధర్2. పుష్ప2 రికార్డు 1871 ఉంది. సో… ఆ బ్యాలన్స్ ని ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రణ్‌వీర్ మీద ఉంది. రిలీజ్ టైమ్‌తో పోలిస్తే ధురంధర్ సీక్వెల్ దూకుడు కాస్త తగ్గిన మాట వాస్తవమే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ధురంధర్ 2 ఇన్నాళ్లూ చేసిన రికార్డులన్నీ ఓ ఎత్తయితే… ఈ 200 ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేయడం మీదనే అందరి ఫోకస్ ఉంది. పుష్ప2ని క్రాస్ చేయడం జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఎన్నాళ్లకి? అంటూ రకరకాల చర్చలు షురూ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jailer 2: జైలర్2 లో పవన్.. ఇంతకీ నిజమేనా ??
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే
డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం