
ఐపిఎల్-2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రోమీ బింధర్ డగౌట్‌లో ఫోన్ వాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. డగౌట్‌లో ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధం కావడంతో రోమీ ఫోన్ వాడటం తీవ్ర దుమారం రేపింది. అయితే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే రోమీ ఫోన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
‘‘రోమీ బింధర్ గతంలో తీవ్ర ఊపిరి తిత్తుల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అప్పుడు అతడు దాదాపు వారం రోజుల పాటు వెంటిరేటర్ మీద ఉన్నాడు. ఆస్తమాతో బాధపడుతున్న అతడు గతంలో దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. అనారోగ్యం కారణంగా అతడు ఎక్కువ దూరం నడవడం.. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతాడు. అయినప్పటికీ.. అతడు టీమ్ కోసం తన సేవలను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తరచూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో అతడు డగౌట్‌లో ఫోన్ వినియోగించాడు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అతడి ఆరోగ్య పరిస్థితిని అవినీతి నిరోధక విభాగం పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉందని.. సదరు వర్గాలు పేర్కొన్నాడు. మరి బిసిసిఐ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.