Reading Time: < 1 minute

ఐటీడీఏల బలోపేతంపై కేంద్రం ఫోకస్ : కేంద్ర గిరిజన శాఖ డైరెక్టర్ వర్నాలి డేకా

Caption of Image.
  • కేంద్ర గిరిజన శాఖ  డైరెక్టర్ వర్నాలి డేకా

హైదరాబాద్, వెలుగు: ఐటీడీఏల ద్వారా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, మౌలిక వసతుల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని కేంద్ర గిరిజన శాఖ (మోటా) డైరెక్టర్ వర్నాలి డేకా సూచించారు. శనివారం మసాబ్ ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్ లో అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపీలోని ఐటీడీఏల బలోపేతంపై అధికారులతో చర్చించారు. 

టాస్క్ ద్వారా యువతకు శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. తెలంగాణ ట్రైబల్ డైరెక్టర్ సంతోష్,  ములుగు కలెక్టర్  దివాకర, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, టీసీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ సముజ్వల, ఏపీ ట్రైబల్ అడిషనల్ డైరెక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.