Reading Time: < 1 minute

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో నూడిల్స్ కోసం రౌడీషీట‌ర్ వీరంగం సృష్టించాడు. చంద్రగిరి ప్రాంతం శ్రీనివాసమంగాపురంలో నూడిల్స్ కోసం అర్ధ‌రాత్రి రౌడీ షీటర్ తన అనుచరులతో హ‌ల్‌చ‌ల్‌ చేశాడు. ఆర్డర్ ఆలస్యంగా వచ్చిందని శ్రీవారి కేఫ్‌లో రౌడీ షీటర్ బాలాజీ అలియాస్ డ్యూక్ బాలు గొడవకు దిగాడు. కేఫ్ యజమాని గిరి, ఆయన కుమారుడు రాహుల్‌ పై గాజు సీసాలతో దాడి చేశాడు. రౌడీ షీటర్, అతని అనుచరులు కంప్యూటర్లు, కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో రౌడీ షీటర్ బాలుకు కూడా గాయాలు తగిలాయి.  కేఫ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రౌడీ షీటర్ తో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి గంజాయికి కేరాఫ్ అడ్రస్ మారిందని స్థానికులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తిరుమల భక్తులను గంజాయి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.