Reading Time: < 1 minute

సాఫ్ట్వేర్ జాబ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న ఫ్రెషర్స్కు TCS బంపర్ ఆఫర్

Caption of Image.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఫ్రెషర్స్కు గుడ్ న్యూ్స్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ పాతిక వేల మంది ఫ్రెషర్స్ను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని TCS డిసైడ్ అయింది. డిమాండ్ కండీషన్స్ను బట్టి పాతిక వేలకు మించి కూడా ఫ్రెషర్స్ను తీసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు TCS సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ తెలిపారు. 2025లో టీసీఎస్లో లేఆఫ్స్కు కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని కృతివాసన్ అన్నారు. 

ప్రాజెక్ట్ అమలులో మార్పుల కారణంగా ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల అవసరం తగ్గడంతో, కంపెనీ ప్రధానంగా సీనియర్ స్థాయిలలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని ఆయన చెప్పారు. టీసీఎస్‌లో కెరీర్ వృద్ధికి పనితీరే కీలక అంశమని, నిరంతరం పరిస్థితులకు అనుగుణంగా మారుతూ.. ఉత్తమ పనితీరును కనబరిచే ఉద్యోగులకు టీసీఎస్లో మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

►ALSO READ | యోకోహామా వైజాగ్ ప్లాంటులో మరింత ఉత్పత్తి

కంపెనీ నుంచి బయటకు వెళ్లే ఉద్యోగుల శాతం (అట్రిషన్) 13.7 శాతానికి తగ్గిందని, ఈ నెల నుంచి సంస్థ వ్యాప్తంగా జీతాల పెంపును అమలు చేస్తున్నట్లు TCS ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ ఈసారి 2, 356 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో 2026 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరింది. 

టీసీఎస్ ఎండీ కృతివాసన్ మాట్లాడుతూ వరుసగా మూడో క్వార్టర్లోనూ వృద్ధిని సాధించామని చెప్పారు. ప్రధాన మార్కెట్లు, అన్ని రంగాల్లో కంపెనీ పనితీరు బాగుందని వివరించారు. ఈ క్వార్టర్లో టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 12.22 శాతం పెరిగి రూ.13,718 కోట్లుగా నమోదైంది.

©️ VIL Media Pvt Ltd.