Reading Time: < 1 minute

వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండా – తట్టెపల్లి మధ్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం తాండూర్  నుంచి జహీరాబాద్ కు స్కూటీపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడిన కుమారుడిని 108లో తాండూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.