Reading Time: < 1 minute

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయాం: కేటీఆర్

Caption of Image.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ టీఆర్ఎస్ గానే ఉండాలనుకుంటున్నామని తెలిపారు. ఆదివారం (2026 ఏప్రిల్ 12) క్యాతనపల్లిలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తాము తప్పులు చేశామని.. అందుకే ఓడిపోయామని అన్నారు. చంద్రుడు తాత్కాలికంగా మబ్బుల సాటుకు పోయాడు.. మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

త్వరలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని అన్నారు కేటీఆర్. డీలిమిటేషన్ తో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్నారు. అసెంబ్లీ స్థానాలు 179 వరకు,  ఎంపీ స్థానాలు 25  వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. 60 ఎమ్మెల్సీ లు పెరుగుతాయన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైతం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్ని స్థానాలు పెరిగినా తమకు సరిపడా నాయకులు ఉన్నారని అన్నారు. తాను ఏ నియోజక వర్గం నుంచైనా పోటీ చేస్తానని అన్నారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమ అని.. బీజేపీతో ఏ పరిస్థితుల్లోపొత్తు పెట్టుకోమని అన్నారు కేటీఆర్.

బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లతో చెట్టాపట్టాలు వేసుకుంటున్నారని.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. కొత్త పార్టీ లు ఎన్ని వస్తే అంత మంచిదే.. కాని జనం ఓట్లు వేయవద్దా.. మన బాధ జనం బాధ అనుకుంటే జనం నమ్మరు.. అంటూ  కవిత పార్టీ గురించి పరోక్షంగా కామెంట్ చేశారు. తమకు ఏ పార్టీ  తో పొత్తులు, సర్దు బాటు ఉండబోదన్నారు. 

©️ VIL Media Pvt Ltd.