Reading Time: < 1 minute
Highway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చేసింది.. ఈ మార్గంలో వెళ్లేవారికి..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ నిర్మించిన తెలుగు రాష్ట్రాల్లోని తొలి గ్రీన్ ఫీల్డ్ హైవేను అధికారులు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారికి ప్రయాణ సమయం తగ్గనుంది. అంతేకాకుండా ట్రాఫిక్ రద్దీ లేని జర్నీ లభించనుంది. తూర్పుగోదావరిలోని దేవరపల్లి నుంచి తెలంగాణలోని ఖమ్మం వరకు ఈ హైవే ఉంటుంది. ఈ నాలుగు లైన్ల హైవేను హైటెక్ హైవేగా పిలుస్తున్నారు. ఎందుకంటే సీసీటీవీ కెమెరాలతో పాటు ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు ఈ మార్గంలో అందుబాటులో ఉన్నాయి.

భారీ వాహనాలకు మాత్రమే అనుమతి

దాదాపు 162 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. వైరా వరకు పనులు పూర్తి కాగా.. అక్కడివరకు వాహనాలను అనుమతిస్తున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఈ హైవే మీద నుంచి వెళుతున్నారు. అయితే ఖమ్మం వరకు పనులు పూర్తి కాలేదు. దీంతో ఖమ్మం వరకు వాహనాలను అనుమతించడం లేదు. ఇక టోల్ గేట్లు, ఫాస్టాగ్ లైన్ల ఏర్పాటు, సీసీకెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ హైవేపై సరికొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ఎంత దూరానికి అయితే ప్రయాణించారో.. అంత ప్రయాణానికి మాత్రమే టోల్ ఛార్జి వసూలు చేస్తారు. ఇక కేవలం లారీలు. బస్సులు, కార్లు, భారీ వాహనాలకు మాత్రమే ఈ హైవేపై అనుమతి ఉంటుంది. ట్రాక్టర్లు, ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతి ఉండదు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే విజయవాడ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ హైవే ద్వారా విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సూర్యాపేట, ఖమ్మం, వైరా, తిరువూరు మీదుగా వెళ్లవచచ్చుజ దీంతో 8 గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు.