
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వింత ఘటన చోటుచేసుకుంది. సింగర్ మంగ్లీ పై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావుకు పిఎస్ లో మద్యం పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులతో గొడవకు దిగడంతోనే ఆయనకు పోలీసులు మద్యం టెస్టు చేశారు. ఈ టెస్టులో 27 బిఎసి వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. పోలీస్ స్టేషన్ కు వచ్చినవారికి మద్యం పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది.