Reading Time: < 1 minute
Balakrishna Gopichand Malineni Nbk111 Song Shooting Update Rfc

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే థమన్ రెండు అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ సాంగ్‌కు ప్రముఖ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే, అదే లొకేషన్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. అయితే ఇంకో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఎంటీ అంటే..

Also Read: Allu Aravind: మృణాల్‌ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..

ఈ సినిమాలో బాలయ్య ఒక రాజుగా కనిపించబోతున్నారని అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. ఆయన సరసన ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార మహారాణి పాత్రలో నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ పీరియాడిక్ డ్రామాలో వీరిద్దరినీ చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి థమన్ తన సంగీతంతో మరిన్ని హంగులు అద్దబోతున్నారు.