Reading Time: < 1 minute

షాక్ ప్రూఫ్ బాడీతో 3 పిన్ ప్లగ్ ట్రావెల్ అడాప్టర్..

Caption of Image.

రైలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఫోన్‌‌కు చార్జింగ్‌‌ పెట్టుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే.. చార్జింగ్ అడాప్టర్‌‌‌‌ ప్లగ్‌‌ చేసేందుకు పవర్ సాకెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఫోన్‌‌ని పెట్టేందుకు సరైన ప్లేస్‌‌ దొరకదు. అలాంటప్పుడు ఈ ట్రావెల్‌‌ అడాప్టర్‌‌‌‌ని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. 

దీన్ని గోల్డ్‌‌ మెడల్‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది యూనివర్సల్ 3–పిన్ ఇంటర్నేషనల్ సాకెట్, 2-–పిన్ సాకెట్‌‌తో వస్తుంది. కాబట్టి ప్రపంచంలోని చాలాదేశాల ప్లగ్స్‌‌కు సపోర్ట్ చేస్తుంది. రెండు డివైజ్​లకు ఒకేసారి పవర్ అందించొచ్చు. దీనికి రబ్బరు ప్యాడ్ గ్రిప్‌‌ ఉన్న మొబైల్ స్టాండ్ (హోల్డింగ్ ట్రే) ఉంటుంది. 

ఫోన్‌‌ను అందులో పెట్టుకుని చార్జ్ చేస్తూ వాడుకోవచ్చు. పవర్‌‌‌‌ని ఇండికేట్‌‌ చేసేందుకు దీనికి ఎల్‌‌ఈడీ ఉంటుంది. షాక్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. 

►ALSO READ | హ్యాండ్ మసాజర్.. టచ్ స్క్రీన్ తో ఆపరేట్.. ఈజీగా రిలాక్స్ కావొచ్చు..
299

©️ VIL Media Pvt Ltd.