Reading Time: < 1 minute

స్వయంభు ఫస్ట్ సింగిల్ రా రా ధీవర ఏప్రిల్ 16న రిలీజ్ యోధుడి అవతారంలో నిఖిల్ పోస్టర్ వైరల్

Caption of Image.

నిఖిల్ హీరోగా హిస్టారికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తోన్న  పాన్ ఇండియా సినిమా  ‘స్వయంభు’.  భరత్ కృష్ణమాచారి దర్శకుడు.  ఠాగూర్  మధు సమర్పణలో  భువన్,  శ్రీకర్ నిర్మిస్తున్నారు.  రవి బస్రూర్ సంగీతం అందించగా, శనివారం  ఈ మూవీ  ఫస్ట్ సింగిల్ అప్‌‌డేట్ అందించారు మేకర్స్.  

రా రా ధీవర’ అంటూ సాగే పాటను   ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ  సందర్భంగా  రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో నిఖిల్ యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.

ఈ పాట ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్  సూచిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులోని పాత్రకోసం నిఖిల్ దాదాపు రెండేళ్లు ఫిజికల్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ అయ్యాడు.  సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా సెంథిల్ కుమార్, ఎడిటర్‌‌‌‌గా తమ్మిరాజు వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కామిశెట్టి డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.