
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా: రేవంత్ సర్కార్ ఫ్యూచర్‌సిటీ మాటున రియల్ మాఫియాను పెంచి పోషిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రా మారావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి రియల్ దందా కొనసాగించేందుకే ఫ్యూచర్ సిటీని ఎంచుకున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ మేర కు శనివారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సమీపంలోని బొం గ్లూర్ ప్రమిద గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థా యి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మం త్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడు తూ.. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు తో రియల్ దందాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. గడిచిన రెండున్నరేండ్ల పాలన అగమ్యగోచరంగా మారిందన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రూ.27వేల కోట్లు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం 11వేల ఉద్యోగాలు ఇవ్వలేక చేతులెత్తేసిందంటూ ఆయన విమర్శించారు. మహిళలకు తులం బంగా రం, యువతకు స్కూటీలు, అత్తా కోడళ్లకు రూ.2,500 ఇస్తామన్న హామీలు నీటి మీద రాతలుగా మారాయన్నారు. రూ.200 పింఛన్ రూ.2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌దని ఆయన అన్నారు.
సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప రాష్ట్రానికి పైసా నిధులు రాబట్టలేకపోతున్నాని ఆయన మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందాలకు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు రియల్ దందాకు ఇది అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేవలం 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోటి ఎకరాలకు చేరిందన్నారు. రేవంత్ సర్కార్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రాబోయేవి అసెంబ్లీ ఎన్నికలు కావని, కేసీఆర్ ఎన్నికలని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు సైతం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేష్, రైతు సమన్వయ సమితి నేత వంగేటి లకా్ష్మరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.