Reading Time: < 1 minute
Ram Pothineni Turns Story Writer For Upcoming Movie Updates

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై విజయవంతంగా రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘దేవదాసు’తో మొదలైన ఈ ప్రయాణంలో లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు తనలోని ప్రతిభను బయటకు తీస్తున్నారు. గతేడాది విడుదలైన ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన రామ్, ఆ సినిమా కోసం తొలిసారి గీత రచయితగా మారి పాట రాయడమే కాకుండా స్వయంగా పాడి అభిమానులను మెప్పించారు. దీంతో..

Also Read : Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

తాజా సమాచారం ప్రకారం, రామ్ ఇప్పుడు తొలిసారి కథా రచయితగా తన ప్రతిభను చాటుకోబోతున్నారు. ఇప్పటికే ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్న ఆయన, దాన్ని పట్టాలెక్కించేందుకు సరైన దర్శకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఒక హీరోనే స్వయంగా కథ రాసుకోవడం అనేది సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే లోకేశ్‌ కనగరాజ్‌ శిష్యుడు లోగి విఘ్నేశ్‌తో రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి లోగి విఘ్నేశ్‌ దర్శకత్వంలో రాబోయే సినిమానే రామ్ రాసుకున్న కథతో ఉంటుందా? లేక మరో దర్శకుడితో ఆ కథను పట్టాలెక్కిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని గురించి వచ్చే నెల (మే) 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్, ఆయన రచయితగా మారడంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన 20 ఏళ్ల అనుభవంతో రామ్ ఎలాంటి కథను సిద్ధం చేశారో చూడాలని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.