Reading Time: < 1 minute

నారాయణపేట: వ్యభిచారం నిర్వహిస్తూ నలుగురు మహిళలు పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్‌ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి.. స్టేట్ హోమ్‌కు పంపిస్తున్నట్లు నారాయణపేట సీఐ శివశంకర్ తెలిపారు. అలాగే, లాడ్జ్ యజమాని బుగ్గేశ్వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

పట్టణంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సిఐ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.