Reading Time: < 1 minute

హైదరాబాద్: కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధి మంగా గంజాయి లో వీరంగం సృష్టించారు. జియాగూడలోని ఓ సందులో బైక్‌పై నుంచి అతి వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. వివాదం క్రమంగా హింసకు దారి తీసింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ఆటోలోని వృద్ధులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అడ్డుకునేందకు వచ్చిన స్థానికులపై కూడా యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, కొద్ది సేపటి తర్వాత గ్యాంగ్‌తో ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి మళ్లీ దాడులు చేశారు. భయంతో గేట్లు మూసుకున్నప్పటికీ.. నిందితులు రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.