Reading Time: < 1 minute

ఈసారి భారత వృద్ధిరేటు 7.6 శాతం.. పీఎల్ అసెట్ మేనేజ్మెంట్ అంచనా

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుదాస్ ​లీలాధర్ అసెట్ మేనేజ్​మెంట్​తాజా రిపోర్ట్​ పేర్కొంది. దీని ప్రకారం.. తయారీ రంగం 13.3 శాతం వృద్ధితో దూసుకుపోతోంది.   చమురు ధరలు పెరుగుదల,  రూపాయి తగ్గుదల వంటి సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నా, డీఐఐల పెట్టుబడులు స్టాక్​ మార్కెట్​కు భరోసా ఇస్తున్నాయి.

 ఈ సంస్థ ఆక్వా ఫండ్ ఫిబ్రవరి నెలలో 2.31 శాతం రాబడిని అందించింది. మెటల్స్, పీఎస్​యూ బ్యాంకులు, ఆటో రంగాల్లో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇచ్చాయి. మల్టీ అసెట్ డైనమిక్ పోర్ట్‌‌‌‌ఫోలియోలో బంగారానికి 34 శాతం వాటా కేటాయించడం వల్ల రిస్క్ తగ్గింది. బంగారం ఫిబ్రవరిలో 8.32 శాతం లాభాన్ని ఇచ్చింది. ప్రస్తుతం నిఫ్టీ గత ఐదేళ్ల సగటు పీఈ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుండటం ఇన్వెస్టర్లకు కలిసివచ్చే అంశం. అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయంలో నాణ్యమైన లార్జ్ క్యాప్ షేర్లను ఎంచుకోవడం ఉత్తమమని రిపోర్ట్​సూచించింది.

©️ VIL Media Pvt Ltd.