Reading Time: < 1 minute

తాయ్ కళవి.. రాధికా శరత్ కుమార్ లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా అంత బాగుందా..?

Caption of Image.
  • టైటిల్: తాయ్ కళవి
  • ప్లాట్‌‌ఫాం: జియో హాట్‌‌స్టార్​
  • డైరెక్షన్: శివకుమార్ మురుగేశన్ 
  • కాస్ట్: రాధికా శరత్‌‌కుమార్, సింగంపులి, అరుళ్​దాస్, బాల శరవణన్, మునీష్‌‌కాంత్, రైచల్ రెబెక్కా

పవునుతాయి (రాధికా శరత్‌‌కుమార్) వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండే వ్యక్తి. తన మాటలు, ప్రవర్తన వల్ల గ్రామస్తులంతా ఆమెను చూస్తేనే భయపడతారు. ఆమెకు ముగ్గురు కొడుకులు. మొదటివాడు ఉప్పిలియన్ (సింగంపులి) కమల్​హాసన్​కు వీరాభిమాని. ఫంక్షన్లకు మ్యూజిక్ సిస్టమ్‌‌లను అద్దెకు ఇస్తుంటాడు. రెండోవాడు విజయన్ (అరుళ్​దాస్) ఆటో డ్రైవర్‌‌. ఒక రూపాయి కోసం యాభై రూపాయలు వృథా చేసే రకం. మూడో కొడుకు సెల్వం (బాల శరవణన్) పూలదండలు అమ్ముతుంటాడు. వ్యాపారం అంతంతమాత్రంగానే నడుస్తుంటుంది.

ఆమెకు ఒక కూతురు (రైచల్ రెబెక్కా).. భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చి, పవునుతాయితోనే ఉంటోంది. అయితే.. పవునుతాయి అకస్మాత్తుగా మంచాన పడుతుంది. ఆ విషయం ఊరికి దూరంగా ఉన్న కొడుకులకు తెలుస్తుంది. ఆమె చనిపోతే వెంటనే ఆస్తులు పంచుకోవచ్చనే ఉద్దేశంతో ఊరికి వస్తారు. సరిగ్గా అదే టైంలో ఆమె గతంలో 160 సవర్ల బంగారం కొని, ఎక్కడో దాచిందని తెలుస్తుంది. ఆ బంగారం ఎక్కడుందో తెలుసుకునేందుకు ముగ్గురూ తల్లిని కాపాడుకోవాలి అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.

©️ VIL Media Pvt Ltd.