
నిరుద్యోగుల ఆశలను పెట్టుబడిగా మార్చుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కాకినాడ జిల్లాలో సాయి ప్రసన్న అనే యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రాజశేఖర్ అనే వ్యక్తి రూ. 14 లక్షలు వసూలు చేశాడు. జాబ్ వెరిఫికేషన్, పీఎఫ్ డిపాజిట్ల పేరుతో విడతలవారీగా డబ్బులు తీసుకున్న రాజశేఖర్, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెంగళూరుకు పారిపోయాడు. ఆలయ అర్చకుడైన సాయి ప్రసన్న తండ్రి సత్యనరేంద్రుడు, తన కొడుకు భవిష్యత్తు కోసం అప్పులు చేసి ఈ డబ్బును రాజశేఖర్‌కు చెల్లించారు. మోసపోయిన బాధితులు 2025లో సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు (ఎఫ్ఐఆర్ నెం. 336/2024). గ్రీవెన్స్‌లో ఫలితం లేకపోవడంతో టీవీ9ని ఆశ్రయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము