Reading Time: 2 minutes
Vishnu Priya: సబ్‌స్క్రైబ్ పేరుతో అసభ్యకర కంటెంట్.. ఇన్ స్టాలో విష్ణుప్రియ ఫోటోస్ పై కేసు నమోదు..

బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు ప్రియ. పోవే పోరా అనే షోతో స్మాల్ స్క్రిన్ పై ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పలు షోలలో యాంకర్ గా అలరిస్తున్న విష్ణు ప్రియ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోస్ అసభ్యకరంగా ఉన్నాయని.. పైగా తన ఫోటోస్, అర్దనగ్న వీడిసో చూడాలంటే సబ్‌స్క్రైబ్ పేరుతో డబ్బులు చెల్లించాలని ప్రచారం చేసుకుంటున్నారని ఏఐఎస్‌ఎఫ్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. అనంతరం ఆమె ఇన్ స్టా బ్లాక్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్, మరికొందరు విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

బుల్లితెరపై పలు షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఒక యాంకర్ ఇలాంటి కంటెంట్ ప్రోత్సహించడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు డబ్బుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్ వల్ల సమాజంలో నైతిక విలువలు దెబ్బతింటాయని అన్నారు. విష్ణుప్రియ ఇన్ స్టా ఖాతాను తక్షణమే నిలిపివేయాలని.. అలాగే ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

చాలా రోజులుగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా తనపై ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై యాంకర్ విష్ణుప్రియ స్పందించాల్సి ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..