Reading Time: < 1 minute

యాక్షన్ విత్ఎమోషన్తో రాజ్ తరుణ్ గాడ్స్ అండ్ సోల్జర్స్

Caption of Image.

రాజ్ తరుణ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’.   రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆదివారం ట్రైజర్ పేరుతో  ఓ స్పెషల్ వీడియోను దర్శకుడు హరీష్​ శంకర్ రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. 

యాక్షన్ విత్ ఎమోషన్‌‌తో కట్ చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రియల్ ఇన్సిడెంట్స్‌‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని  దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నాడు.  సునీల్, ‘ప్రేమిస్తే’ భరత్‌‌, పాల్, అమ్ము అభిరామి  ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.