Reading Time: < 1 minute
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి టీటీడీ భారీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటివారికి టీటీడీ సూపర్ న్యూస్ అందించింది. జులై నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను ఆన్ లైన్‌లో విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దర్శనం టికెట్ల విడుదల తేదీలు

-ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన టికెట్లను రిలీజ్ చేయనుంది.

– ఇక ఈ నెల 20న ఉదయం 10 గంటలకు సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

-21వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను విడుదల చేయనున్నారు

– 21న మధ్యాహ్నం ఆన్ లైన్ వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా విడుదల చేయనుంది

-23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవారి ట్రస్టు దర్శన టికెట్లను రిలీజ్ చేయనుంది

-23న మధ్యాహ్నం దివ్యాంగులు, వయోవృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవాకి కోసం ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనుంది

-24వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది

-టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు