Reading Time: < 1 minute
Sanju Samson Breaks Dhoni Record Csk Vs Delhi Capitals Ipl 2026

Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ ఖాతా తెరిచింది. 23 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిచింది. సీఎస్‌కే తరఫున ఆడిన నాలుగో మ్యాచ్‌లో సంజూ శామ్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బాల్స్‌లో 115 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది నాటౌట్‌గా నిలిచాడు. తన ఫామ్ గురించి వస్తున్న విమర్శలకు సంజూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సీఎస్‌కే జెర్సీలో సంజూకి ఇదే తొలి సెంచరీ.. అంతేకాదు.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోనీ (2019లో ఆర్సీబీపై 84 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇక ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల (ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే) తరఫున సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా శామ్సన్ నిలిచాడు. అంతకుముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.

READ MORE: Trump: “అలా చేస్తే నా నెక్ట్స్‌ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సంజూ శుభారంభం ఇచ్చాడు. పవర్‌ప్లేలో గైక్వాడ్ నెమ్మదిగా ఆడినా, సంజూ మాత్రం దూకుడు పెంచాడు. అనంతరం యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రేతో కలిసి రెండో వికెట్‌కు కేవలం 11 ఓవర్లలోనే 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్హత్రే అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, సంజూ తన క్లాస్ షాట్లతో హోమ్ గ్రౌండ్ అభిమానులను అలరించాడు. ఈ సీజన్ ఆరంభంలో తడబడిన సంజూ, ఈ సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి రావడమే కాకుండా ‘అన్బుడెన్’ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ సాయంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేజింగ్ బరిలోకి దిగిన ఢిల్లీ 189 పరుగులకే కుప్పకూలింది.

READ MORE: RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?